ప్రస్తుతం ఈ క్రింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది.
1)శ్రీ కూరపాటి కోటంరాజు చైర్మన్ ట్రస్టీ
2)శ్రీ సరికొండ నరసింహారాజు గారు వైస్ చైర్మన్ ట్రస్టీ
3)శ్రీ పూసపాటి సాయి కృష్ణ గారు సెక్రటరీ ట్రస్ట్
4)శ్రీ చక్రాల హర్షవర్ధన రాజు ఆర్గనైసింగ్ సెక్రటరీ ట్రస్టీ
5)శ్రీ చక్రవరం చిన కోటంరాజు గారు ట్రెసరర్ ట్రస్టీ
6)శ్రీ నండూరి ఆంజనేయరాజు గారు, మెంబెర్ ట్రస్టీ
7)శ్రీ కూరపాటి నాగరాజు మెంబెర్ ట్రస్టి
8)శ్రీ కాసుల రాజ శ్రీధర్ మెంబెర్ ట్రస్టీ
9) శ్రీ నండూరి పురుషోత్తం రాజు మెంబెర్ ట్రస్టీ
ఈ దిగువ తెలిపిన వారిని ట్రస్ట్ గౌరవ సలహా సభ్యులుగ ఏకగ్రీవంగా తీర్మానించట మైనది
1)శ్రీ ప్రతిగుడుపు జయప్రకాశ్ రాజు గారు విజయవాడ
2)శ్రీ గవర్రాజు దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్
3)శ్రీ చక్రవరం సత్యనారాయణ రాజు గారు.చిలకలూరిపేట
ఈ ట్రస్ట్ కు ప్రముఖ కవి శ్రీ రామరాజ భూషణు ని పేరు పెట్టడం జరిగింది. వీరు రచించిన వసు చరిత్రము ఆంధ్ర వాఙ్మయమున నొక యపూర్వ కవితా సృష్టి అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
ఈ ట్రస్ట్ మన భట్టరాజులలో -
[1] తెలివైనవారిని, చదువు పట్ల ఆసక్తి వుండి పేదరికం కారణంగా చదువుకోలేక పోతున్న విద్యార్థులకు సహాయపడుటకొరకు,
[2] మెరుగైన నైపుణ్యం కలిగి తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మన యువతకు సరైన అవకాశాలు లభించేలా కృషి చేయుటకు ,
[3] ఇప్పటికే సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మన కులస్థులను సత్కరించి , వారి అనుభవాలను అభివృద్ధి చెందుతున్న భట్టరాజీయులకు అందించుటకు వేదికగా నుండుటకు, [4] విద్యా, సామాజిక కార్యక్రమాల ద్వారా భట్టరాజ కులస్థుల సేవలను సమాజానికి అందించి సమాజసేవలో మరింత చురుకుగా పాల్గొనుట ముఖ్య వుద్దేశ్యముగా ఏర్పాటైనది.
గత 29 సంవత్సరాలుగా ట్రస్ట్ నిర్వహించుచున్న ఈ స్కాలర్షిప్పుల పంపిణీ కార్యక్రమానికి
16,10,000/- రూపాయలను మూలధనంగా అందించి ఎంతోమంది వదాన్యులు సహాయపడ్డారు. ఈ ట్రస్ట్ వారందరకూ కృతజ్ఞత తెలుపుకుంటున్నది. ఈ ధనమంతయూ బ్యాంకులలో ఫిక్సెడ్ డిపాజిట్ గా వుంచడమైనది.
ఈ ట్రస్ట్ మూలధనం లో నుండి వచ్చిన వడ్డీతో మాత్రమే క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం జిల్లాల విద్యార్థులకు వుపయోగపడే విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని , రు. 25,000/- విరాళంగా ఇచ్చిన వారి పేరుతో దాని నుండి వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి పారితోషికం ఇచ్చుటకు ట్రస్ట్ కార్యవర్గం తీర్మానించింది.దీనికి స్పందించి అనేకమంది దాతలు విరాళాలు అందించి తమ దాతృత్వాన్ని తెలియజేశారు.
ఈ మూలధనం నుండి రాబడిన వడ్డీ మరియు దాతలనుండి సేకరించిన ధనంతో విద్యార్థులకు పారితోషికం ముఖ్య అతిథులచే అందజేయబడుతున్నది. ఇప్పటివరకు ట్రస్ట్ పంపిణీ చేసిన పారితోషికం ఈ దిగువన వుదహరించుచున్నాము.
2013 సంవత్సరము నుండి క్రిష్ణా జిల్లాలోని 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు కూడా రూ. 1,000/- చొప్పున ఆర్ధిక సహాయము అందజేయడం జరుగుతున్నది.
2018 సంవత్సరము నుండి 10 వ తరగతి మరియు సీనియర్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో 10 జి.పి.యె. వచ్చిన విద్యార్థులకు రు. 2,500/- ఇవ్వడం జరుగుతున్నది .