కీర్తి శేషులు శ్రీ దింటకుర్తి పుల్లం రాజు గారు భట్రాజు కులంలోని పిల్లలు ప్రతిభ కలిగి వున్నప్పటికి ఆర్ధికంగా వెసులుబాటు లేక పలు రకాల పనులు చేసుకొనటం చూసి , బాధపడి ``రాజుల సేవా సమితీ'' అను సేవా సంస్థను స్థాపించి భట్రాజు కులం లోని విద్యార్థులు చదువుకొనటానికి తనవంతు కృషి చేశారు.
భట్రాజు కులం లోని చిన్నారులు ప్రతిభ కలిగి వున్నప్పటికి చదువు కొనసాగించలేకపోతున్నారని , వారికి మరింతగా సహాయ సహకారాలు అందించాలనే వుద్దేశ్యంతో ` రాజుల సేవా సమితి ' ని `` శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ '' అనే పేరుతో ది. 24-01-2008 న రిజిస్టరు చేయించడం జరిగింది.[ రిజిస్టర్ నెం. 18/బి.కె.4/2008 ] .
ఈ ట్రస్ట్ వున్నతికై శ్రీ గవర్రాజు వెంకటరామ రాజు గారు , శ్రీ బిరుదురాజు వెంకటేశ్వర రాజు గారు , శ్రీ బిరుదురాజు వెంకట అప్పల రాజు గారు , శ్రీ తోకచిచ్చు గంగ రాజు గారు , శ్రీ రాళ్ళబండి బ్రహ్మ రాజు గారు , శ్రీ కూరపాటి కోటం రాజు రాజు గారు , మొదలైనవారు ఎంతో క్రుషి చేశారు.